వేధింపులతో యువతి ఆత్మహత్యాయత్నం | girl attempt suicide | Sakshi
Sakshi News home page

ఉన్మాది వేధింపులు,యువతి ఆత్మహత్యాయత్నం

Jan 2 2018 7:03 PM | Updated on Jan 2 2018 7:18 PM

వరంగల్ అర్బన్: ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వరంగల్‌ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో జరిగింది. తనను పెళ్లి చేసుకోమంటూ మనోహర్‌ అనే యువకుడు ఆరు నెలలుగా రమ్య అనే యువతి వెంట పడుతున్నాడు. ఈ విషయంలో అతని సోదరులు సోమవారం రాత్రి ఆమె ఇంటి వద్ద గొడవకు దిగారు కూడా. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో ప్రాణాపాయ స్థితిలో ఆమె చికిత్స పొందుతున్నది.

Advertisement
 
Advertisement
Advertisement