పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత | ganja caught in hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత

Feb 17 2018 2:31 PM | Updated on Feb 17 2018 2:31 PM

నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని ఓల్డ్ సిటీలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రెండు కార్లలో తరలిస్తున్న 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో పలువురు పరారైనట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement