స్నేహితుడు మాట్లాడటం లేదని..

Friend Suicide When Hes Avoiding in Hyderabad - Sakshi

యువకుడి ఆత్మహత్య

చాంద్రాయణగుట్ట: స్నేహితుడు మాట్లాడటం లేదని మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌  కోటేశ్వర్‌ రావు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ అజహర్‌(23) పత్తర్‌గట్టిలో వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా పక్క దుకాణంలోనే పని చేసే అతడి స్నేహితుడు రషీద్‌ అతనితో మాట్లాడడం లేదు.

అప్పటి నుంచి మనస్తాపానికిలోనైన అజహర్‌ ముభావంగా ఉంటున్నాడు.  శుక్రవారం మ«ధ్యాహ్నం దుకాణం నుంచి ఇంటికి వచ్చాడు. పని నిమిత్తం బయటికి వెళ్లిన అతని తల్లి ఫోన్‌ చేసిననా స్పదించకపోవడంతో సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా వంట గదిలోని పైప్‌నకు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top