
అదృశ్యమైన నలుగురు చిన్నారులు
తూప్రాన్: మెదక్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. బుధవారం తూప్రా న్ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తూప్రాన్ ఎస్‌ఐ సుభాష్ తెలిపిన వివరాలు ప్రకారం.. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన నస్రీన్‌భాను భర్త జాకీర్‌తో గొడవ పడి తూప్రాన్‌లో నివా సం ఉంటున్న తన సోదరి ఇంటికి నెల క్రితం తన నలుగురు పిల్లలతో కలసి వచి్చంది. ప్రస్తుతం ఆమె సిద్దిపేట జిల్లా నాచారం సీడ్ పరిశ్రమలో దినసరి కూలీ గా పని చేస్తోంది. బుధవారం కంపెనీ నుంచి ఇంటికి వచి్చన నస్రీన్‌భానుకు తన నలుగురు పిల్లలు ఎస్‌కే షాకీర్ (10), ఎస్‌కే సబెర్(8), ఎస్‌కే నజరీన్(6), ఎస్‌కే సదూర్(4) కనిపించ లేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చిన్నారుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.