పోర్న్‌ వీడియో చూసి ఐదుగురు మైనర్‌ బాలురు..

Five Boys Rape 8 Year Old Girl After Watching Porn In Dehradun - Sakshi

డెహ్రడూన్‌ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్‌ వీడియోలు చూసి  9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సాహస్‌పూర్‌ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top