సాక్షి, మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. కూనేరు పంచాయతీ పరిధిలోని రేగిలపాడు గిరిజన గ్రామంలో 12 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గిరిజన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. సహాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.