కసాయి తండ్రి: ముగ్గురు కూతుళ్ల దారుణ హత్య!

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫయాజ్ అనే కసాయి తండ్రి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు.. అఫియా (10), మహీన్ (9), జియా( 7) రాజారాం దుబ్బ చెరువులో విగతజీవులై కనిపించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృత దేహాలు శుక్రవారం బయటపడ్డాయి. కుటుంబ కలహాలతోనే తండ్రి ఫయాజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి