కారే చితిగా మారిందా?

Family Died in Car Fire Accident Karnataka - Sakshi

గోడను ఢీకొని మంటల్లో చిక్కుకున్న కారు  

దంపతులు, ఇద్దరు పిల్లలు సజీవ దహనం  

హాసన్‌ జిల్లాలో ఘోరం  మృతులు బెంగళూరువాసులు  

సురక్షితంగా గమ్యం చేరుస్తుందనుకున్న కారే చితిగా మారిపోయింది. పనిమీద మంగళూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురై మంటలపాలైంది. అందులోని కుటుంబం మొత్తం సజీవ
దహనమైంది. తెల్లవారురుజాము కావడంతో బాధితులఆర్తనాదాలు వినేవారే లేకపోయారు.  

కర్ణాటక, బనశంకరి: వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న భవనం గోడను డీకొనడంతో కారులో మంటలు చెలరేగి అందులోని నలుగురు సజీవ దహనమయ్యారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దుర్ఘటన హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.... బెంగళూరులోని చిక్కబాణవారలో వివేకనాయక్‌ (45) కుటుంబంనివాసముంటోంది. ఇతను బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఒక కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి మంగళూరుకు కారులో వెళ్లారు. బుధవారం రాత్రి అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.  ఆ సమయంలో వివేక్‌ నాయక్‌ కారు నడుపుతున్నాడు.

మరుగుదొడ్డి గోడను ఢీకొని..  
తెల్లవారుజామున హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణ ఉదయపుర వద్ద హైవే– 75పై వేగంగా వస్తు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న మరుగుదొడ్డి గోడను డీకొంది. కారు ఇంధన ట్యాంక్‌ పగిలిపోయి మంటలు చెలరేగాయి. కారుమంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో సాయం చేసేవారెవరూ లేకపోయారు. వివేక్‌నాయక్‌ (45), భార్య రేష్మానాయక్‌ (38), కుమార్తె వినంతి నాయక్‌ (10) ఎనిమిదేళ్ల కొడుకు సజీవదహనమైయ్యారు. అప్పటికి కొందరు స్థానికులు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చెన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top