నకిలీ కరెన్సీ నోట్ల హల్‌చల్‌ | Fake Notes Huchul In Chittoor | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ నోట్ల హల్‌చల్‌

Jul 13 2018 11:50 AM | Updated on Jul 13 2018 11:50 AM

Fake Notes Huchul In Chittoor - Sakshi

గుర్రకొండలో నకిలీ రూ.50 నోట్లు

గుర్రంకొండ: మండల కేంద్రమైన గుర్రంకొండలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. రూ.100, రూ.50 నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కువగా చలామణీ జరుగుతోంది. రూ.50 నోట్లలో సాధారణంగా ఉన్న సహజ రంగుల కంటే నకిలీ నోట్లు భిన్నంగా కనిపిస్తున్నాయి. నోటు దళసరి కూడా సాధారణ నోటు కంటే చాలా పలుచగా ఉంటోంది. జనం రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండు, వారపు సంతల్లో నకిలీ నోట్లు చలామణీ ఎక్కువగా జరుగుతోంది. రూ. 100 నోట్లు కూడా నకిలీవి హాల్‌చల్‌ చేస్తున్నాయి. బస్టాండులోని చిల్లరు దుకాణంలో ప్రతి నిత్యం ఈ నోట్లు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement