సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా | Fake CBI Officer Escape With 250 Grams Gold At Ameerpet | Sakshi
Sakshi News home page

25 తులాల బంగారంతో ఉడాయించిన వైనం

Sep 24 2019 1:04 PM | Updated on Sep 24 2019 1:18 PM

Fake CBI Officer Escape With 250 Grams Gold At Ameerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ అధికారులమంటూ 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయిన సంఘటన అమీర్‌పేటలో చోటు చేసుకుంది. వివరాలు.. జగదీష్‌ అనే జ్యోతిష్యుడు అమీర్‌పేట అన్నపూర్ణ బ్లాక్‌లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ జగదీష్‌ కార్యాలయంలో ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు జరిపి 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న జగదీష్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement