ఫేస్‌బుక్‌లో దిశపై అసభ్య ప్రచారం

Facebook : Man HelD For Postion Obscene Comments on Disha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశ కేసులో పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో బాధ్యతరాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలిని కించపరిచేలా, అత్యాచారాలను సైతం సమర్థించేలా కొందరు వికృతంగా కామెంట్లు పెడుతున్నారు. నీచంగా పెడుతున్న కామెంట్లు ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వాటిపై పోలీసులు కూడా సత్వరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన స్టాలిన్ శ్రీరామ్‌ను సీసీఎస్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో నిందితుడు ఆన్‌లైన్‌లో అసభ్య ప్రచారం చేశాడు. ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్‌గా  ఏర్పడి దిశపై ఇష్టారీతిలో శ్రీరామ్‌ గ్యాంగ్‌ కామెంట్లు చేసింది. ఈ ఘటన తమ దృష్టికి రావడంతో సుమోటోగా పోలీసులు కేసును స్వీకరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top