
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. మనస్తాపంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఈఎస్‌ఐ కుంభకోణంలో పద్మను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో పద్మ నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
కాగా తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.