ఈఎస్‌ఐ స్కాం: మరో ఇద్దరు అరెస్ట్‌ | ESI Medicine Scam: Two More Arrested | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ స్కాం: మరో ఇద్దరు అరెస్ట్‌

Dec 21 2019 7:43 PM | Updated on Dec 21 2019 7:46 PM

ESI Medicine Scam: Two More Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల గోల్‌మాల్‌ కేసులో అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూ ఉంది. తాజాగా మరో ఇద్దరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. మెడికల్ ఏజెన్సీ ప్రతినిధులుగా వ్యవహరించిన భూపాల్‌ రెడ్డి, నాగేందర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి బినామీ కంపెనీలకు వీరిద్దరూ సహకరించినట్లు ఏసీబీ విచారణలో వెల్లడి అయింది. ఫార్మా కంపెనీల పేరుతో తప్పుడు లెక్కలు చూపించి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్థారణకు వచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement