కత్తుల రవికి బెయిల్‌ మంజూరు

Eluru Court Granted Bail To YSRCP Leader Kathula Ravi  - Sakshi

పశ్చిమగోదావరి : వైఎస్సార్‌సీపీ నేత కత్తుల రవికుమార్‌కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వైఎస్సార్‌సీపీ నేత రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెల్సిందే.

అరెస్ట్‌ అనంతరం పొద్దున్నుంచి ఏలూరు వీధుల్లో, సందుల్లో తిప్పుతూ బెదిరింపులకు పాల్పడుతూ చివరికి ఏలూరు రెండవ అదనపు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి సొంతపూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవిని వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ మంత్రి మరడాని రంగా రావు, కొఠారు రామచంద్రరావు, కొయ్యే మోషెన్‌ రాజు, దళిత సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు.

‘నేను ఏ తప్పూ చేయలేదు’
వినాశకాలే ‘విప్‌’రీత బుద్ధి
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top