స్టాంపు కుంభకోణం కేసులో 8మంది సస్పెండ్ | Eight Members Suspended In Stamp Scam At Adilabad District | Sakshi
Sakshi News home page

స్టాంపు కుంభకోణం కేసులో 8మంది సస్పెండ్

Jul 2 2019 8:18 PM | Updated on Jul 2 2019 8:18 PM

Eight Members Suspended In Stamp Scam At Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్‌లోని రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. 2014వ సంవత్సరంలో స్టాంపుల క్రయవిక్రయాలకు సంబంధించిన కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేసు నమోదునమోదై విచారణ జరుగుతుంది. స్టాంపుల కుంభకోణంలో భాగంగా మంగళవారం రోజు ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నలుగురు సబ్ రిజిస్టార్లతోపాటు నలుగురు ఉద్యోగులు ఉన్నారు.  అప్పట్లో జరిగిన ఈ కుంభకోణంలో 70 లక్షల రూపాయల మేర క్రయవిక్రయాల్లో భారీ అవినీతి జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరిపిన అధికారులు వారిని సస్పెండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement