తప్పతాగి ఖాకీలపైనే..

Drunk Men Clash With Policemen In Goa - Sakshi

పనాజీ : తప్పతాగి హైవేపై రచ్చ చేస్తోన్న తాగుబోతులను మందలించిన పోలీసులపైనే మందుబాబులు వీరంగం వేసిన ఘటన గోవా లో వెలుగు చూసింది. దక్షిణ గోవా జిల్లా కుంకోలిం ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులకు గాయాయల్యాయి. నిందితులు పోలీస్‌ వాహనంపైనా దాడిచేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. కుంకోలిం గ్రామంలోని హైవే వద్ద కొందరు వ్యక్తులు అతిగా ప్రవర్తిస్తున్నారని సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు పోలీస్‌ బృందాన్ని పంపామని ఎస్పీ అరవింద్‌ గవాస్‌ చెప్పారు. ఘటనా స్ధలానికి పోలీసులు చేరుకోగానే తప్పతాగిన నిందితులు ఖాకీలపైనే భౌతిక దాడికి దిగారని ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని, పోలీస్‌ వాహనంపైనా వారు దాడికి తెగబడ్డారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top