మేనమామ వరుస అయిన వ్యక్తితో.. | Doctor Arrested In Harassment Case | Sakshi
Sakshi News home page

పరమనీచుడు

Apr 4 2018 9:31 AM | Updated on Apr 4 2018 9:36 AM

Doctor Arrested In Harassment Case - Sakshi

డాక్టర్‌ మంజునాథ్‌

యశవంతపుర (కర్ణాటక) : పెళ్లయి మూడేళ్లయినా గర్భం దాల్చలేదని భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న నీచుడిని ఇక్కడి బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు... డాక్టర్‌గా కొలువు వెలగపెడుతున్న మంజునాథ్‌కు నగరానికి చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చలేదని తరచూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో బాధితురాలు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు.

ఇదిలా ఉంటే మంజునాథ్‌ వికృత చేష్టలు పెరిగిపోయాయి. తన మేనమామ వరుస అయిన వ్యక్తితో గడపాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించేవాడు. అదే సమయంలో నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న భవనం అమ్మి డబ్బు తీసుకురావాలని డిమాండ్‌ చేసేవాడు. విషయం మీడియా దృష్టికి రావటంతో స్పందించిన పోలీసులు వైద్యుడు మంజునాథ్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement