దివ్యాంగుడి ‘హోదా’ పోరు.. | Disabled Man Fighting For 'Special Status' | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడి ‘హోదా’ పోరు..

May 19 2018 10:58 AM | Updated on Mar 23 2019 9:10 PM

Disabled Man Fighting For 'Special Status' - Sakshi

ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై మూడు చక్రాల రిక్షాతో రామిశెట్టి చిన్నారావు  

భోగాపురం : మండల కేంద్రంలోని మారుతీ వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి చిన్నారావు ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన మూడు చక్రాల సైకిల్‌ సీటు వెనుక ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కూడిన బోర్డు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే కలిగే ప్రయోజనాలను జనానికి వివరిస్తున్నారు.

హోదాకోసం పోరుబాట సాగించాలంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. ఎండతో నీకెందుకీ బాధ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బంది ముందు తను పడుతున్న కష్టం ఎక్కువేమీ కాదని సమాధానం చెప్తున్నారు. హోదా సాధించేందుకు కృషిచేసే నాయకులు అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.  ఆయన సాగించిన హోదా పోరుకు అంతా మెచ్చుకుంటున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement