బాటిల్‌ తెచ్చిన వివాదం.. ముగ్గురు బలి | In Delhi Neighbour Stabs Family Of 3 Over A bottle Issue | Sakshi
Sakshi News home page

వీడియో తీయడంలో బిజీ అయిన జనాలు

Jan 17 2019 4:20 PM | Updated on Jan 17 2019 6:07 PM

In Delhi Neighbour Stabs Family Of 3 Over A bottle Issue - Sakshi

నిందుతుడు ఆజాద్‌ (పక్క చిత్రంలో) దాడి చేస్తున్న ఆజాద్‌

న్యూఢిల్లీ : అసహనం, కోపం మనిషి చేత ఎలాంటి పనులు చేయిస్తాయో ఇది చదివితే అర్థమవుతుంది. ఇరుగుపొరుగు ఇళ్ల మధ్య వచ్చిన ఓ చిన్న వివాదం ముగ్గుర్ని బలిగింది. వివరాలు.. ఢిల్లీలో ఉంటున్న ఆజాద్‌(40), వీరు(41) పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వీరు కూతురు ఓ బాటిల్‌ను తమ ఇంటి బాల్కనీ నుంచి రోడ్డు మీదకు విసిరింది. అయితే దురదృష్టవషాత్తు అది వెళ్లి రోడ్డు మీద నిల్చున్న ఆజాద్‌కు తగిలింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరకు ఎలాగోలా ఆ వివాదం కాస్తా సద్దుమణిగింది.

ఈ క్రమంలో బధవారం రాత్రి ఇరు కుటుంమాల మధ్య మరోసారి తగాద ప్రారంభమయ్యింది. ఈ వివాదం కాస్తా ముదరడంతో.. సహనం కోల్పోయిన ఆజాద్‌ కత్తి తీసుకుని వీరు కొడుకు మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన వీరు, అతని భార్య మీద కూడా దాడి చేశాడు. అనంతరం ఆజాద్‌ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. వీరు భార్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

                                        (వీరు భార్య, కుమారుడు (ఫైల్‌ ఫోటో))

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరు, అతని కొడుకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత పెద్ద తగాద జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వారు ఆపకపోగా.. దీన్నంతా తమ ఫోన్‌లలో వీడియో తీయడంలో బిజీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆజాద్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement