మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన

DCW volunteer beaten up paraded by liquor mafia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. లిక్కర్‌ మాఫియా గురించి సమాచారం అందించిన ఓ మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ మహిళా కమీషన్‌ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. 

పోలీస్‌ చౌకీ సమీపంలో నివసించే మహిళ ప్రవీణ్‌.. నారెళ్లలో ఇల్లీగల్‌గా లిక్కర్‌ అమ్ముతున్న కొందరి గురించి ఢిల్లీ మహిళా కమీషన్‌కు సమాచారం అందించింది. దీంతో వారు దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఆ మాఫియాకు చెందిన ఓ మహిళ కొందరు పురుషులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్‌పై గురువారం దాడికి తెగబడ్డారు. రాడ్లతో ఆమెను కొడుతూ నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. 

స్థానిక పోలీసులు మాత్రం కేవలం ఆమెపై దాడి మాత్రమే జరిగిందని.. ఆ ఘటనలో ఆమె బట్టలు చినిగిపోయాయని చెబుతున్నారు. పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్‌ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రవీణ డీసీడబ్ల్యూ వాలంటరీగా పని చేస్తోందని.. ఆమెకు అవమానం జరిగిన మాట వాస్తవమని డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ అంటున్నారు. ఈ మేరకు రోహిణి డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌నీశ్‌ గుప్తాను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. 

సిగ్గు చేటు.. సీఎం కేజ్రీవాల్‌

కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవీల​ స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.

Back to Top