వుమెన్‌ ట్రాఫికింగ్‌; 16 మందిని రక్షించిన డీసీడబ్ల్యూ

DCW Saves Trafficked Women In Delhi - Sakshi

న్యూఢిల్లీ : వుమెన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠా చెర నుంచి 16 మంది మహిళలను ఢిల్లీ మహిళ కమిషన్‌(డీసీడబ్య్లూ) రక్షించింది. బుధవారం ఉదయం మునిర్క ప్రాంతంలో దాడులు చేపట్టిన కమిషన్‌ సభ్యులు.. ఒక గదిలో బంధించి ఉన్న మహిళలను గుర్తించారు. నేపాల్‌కు చెందిన మహిళలకు మాయ మాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకొచ్చారని డీసీడబ్య్లూ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ తెలిపారు. వారిని కొన్ని రోజుల్లోనే కువైట్‌, ఇరాక్‌లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ విచారణలో తేలిందన్నారు.

మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బాధితుల వద్ద నుంచి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్న ముఠా సభ్యులు వారిని గదిలో బంధించారని తెలిపారు. ఈ రాకెట్‌ గత ఎనిమిది నెలలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. గత 15 రోజుల్లోనే ఈ ముఠా ఏడుగురు యువతులను కువైట్‌, ఇరాక్‌లకు అక్రమ రవాణా చేసిందని వెల్లడించారు.

కేంద్రాన్ని నిలదీసిన కేజ్రీవాల్‌
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు ఎక్కడున్నారంటూ చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు వారి ఆధ్వర్యంలోనే ఉన్నారని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై లేదా అని మండిపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top