ప్రియుడి చేతిలో వంచనకు గురైన యువతి

Daughter Love Failure Father Commits Suicide in Karnataka - Sakshi

మనో వేదనతో తండ్రి ఆత్మహత్య

కృష్ణరాజపురం : కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన ఉదయ్‌ అదే ప్రాంతానికి చెందిన యువతి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అప్పటికే  వివాహమైన ఉదయ్‌ తనకు  వివాహమైన విషయాన్ని దాచిపెట్టి   ప్రేమ నాటకాన్ని కొనసాగించాడు. ఇరువురి ప్రేమ విషయం తెలుసుకున్న  యువతి తండ్రి   గతనెల 30వ తేదీన వారి వివాహానికి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లు చేశాడు.

మహూర్తానికి సమయం మించిపోతున్నా ఉదయ్‌ రాకపోవడంతో గాలింపు చేపట్టగా హఠాత్తుగా ఆ యువతి ఇంటివద్ద ప్రత్యక్షమైన ఉదయ్‌ భార్య విషయం మొత్తం బయటపెట్టింది. కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక ఆ   యువతి తండ్రి  ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని లేఅవుట్‌ పోలీసులు కేసు   దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top