తమిళిసైపై అసభ్య పోస్టులు | Cyber Crime Case Files On Woman In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళిసైపై అసభ్య పోస్టులు

May 31 2018 7:34 AM | Updated on Oct 22 2018 6:10 PM

Cyber Crime Case Files On Woman In Tamil Nadu - Sakshi

సూర్య ఆరో

టీ.నగర్‌: వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తమిళిసై సౌందరరాజన్‌ గురించి అసభ్యంగా పోస్టులు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ నాలుగేళ్ల ప్రగతి గురించి బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ మహిళ ఒకరు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశారు. ఇందులో తమిళిసైపైన అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ  నిమిషం 10 సెకండ్ల వీడియో నమోదైంది. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిని బీజేపీ, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇలావుండగా దీని గురించి రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ టీకే రాజేంద్రన్‌కు బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం అద్యక్షుడు ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా తెలిపారు. కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో సూర్య ఆరో అనే మహిళ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై, ముఖ్యమంత్రి ఎడపాడిలను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు చేసినట్లు తెలిపారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement