లైంగిక వేధింపుల కేసులో క్రికెట్‌ కోచ్‌ అరెస్ట్‌ | Cricket coach arrested for harassing minor boy | Sakshi
Sakshi News home page

Jan 31 2018 2:12 PM | Updated on Sep 26 2018 6:09 PM

Cricket coach arrested for harassing minor boy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు : ఐపీఎల్‌లో అవకాశం ఇప్పిస్తానని ఓ 13 ఏళ్ల బాలుడిపై ఓ క్రికెట్‌ కోచ్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో క్రికెట్‌ అకాడమీ నడుపుతున్న 30 ఏళ్ల నజీర్‌ 13 ఏళ్ల బాలుడికి గత 8 నెలలుగా శిక్షణ ఇస్తున్నాడు.

గత శనివారం బాలుడి క్రికెట్‌ ప్రాక్టీస్‌ ముగిసిన తర్వాత  ఇంటి దగ్గర దిగబెడతానని తన వ్యానులో ఎక్కించుకున్నాడు. ప్రయాణంలో అభ్యంతరకర రీతిలో చేతితో తాకి.. తనకు సహకరించాలని కోరాడు. అక్కడి నుంచి తప్పించుకొచ్చిన బాలుడు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కోచ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement