ఆర్టీసీ బస్‌ ఢీకొని దంపతులు మృతి

Couple killed after APSRTC bus hits 2-wheeler in Outer Ring Road - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు దుర‍్మరణం చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్‌ కోహెడకు చెందిన బొక్క రమణారెడ్డి, విజయమ్మ ద్విచక్ర వాహనంపై శుభకార్యానికి వెళుతుండగా పశ్చిమ గోదావరి జిల్లా తుని డిపోకు చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా మృతుడు రమణారెడ్డి బండ్లగూడ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. మరోవైపు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ మృతుల కుటుంబీకులు, స్థానికులు దంపతుల మృతదేహాలతో విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top