కమెడియన్‌ హరిబాబు అరెస్టు | Comedian And Red Sandal smuggler Haribabu Arrest  | Sakshi
Sakshi News home page

Jul 17 2018 3:59 PM | Updated on Aug 21 2018 6:08 PM

Comedian And Red Sandal smuggler Haribabu Arrest  - Sakshi

సాక్షి, తిరుపతి : బుల్లితెర కమెడియన్, ఎర్రచందనం స్మగ్లర్‌ హరిబాబును తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. గత కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్‌ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.

ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసే క్యారెక్టర్‌ ఆర్టిస్‌. తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉండిన హరిబాబు ఎర్రచందన స్మగ్లింగ్‌తో కోట్లకు పడగలెత్తాడు. అతను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడని సమాచారం. ఇటీవలే ఓ కమెడియన్‌ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ మధుబాబు నేతృత్వంలో మంగళవారం హరిబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్‌ హరిబాబుపై 10 పోలీస్‌ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement