గుంటూరులో కీచక చర్య | CI Car Driver attempt to Rape Girl in Guntur | Sakshi
Sakshi News home page

Jul 10 2018 11:23 AM | Updated on Aug 24 2018 2:36 PM

CI Car Driver attempt to Rape Girl in Guntur - Sakshi

మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి

సాక్షి, గుంటూరు : మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు నగరంలో మైనర్‌ బాలికపై సీఐ కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ కామాంధుడి చర్యతో బెంబేలెత్తిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో పట్టాభిపురం సీఐ కారు డ్రైవర్ జానీ బాలికను వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సీఐ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తే.. ఇలా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement