భర్తను కూడా కడతేర్చాలనుకున్నా!

Child Murderer Abhirami Arrest In Kanya Kumari - Sakshi

పిల్లల్ని హతమార్చిన తల్లి

కన్యాకుమారిలో అరెస్ట్‌

సాక్షి, చెన్నై, టీ.నగర్‌: భర్తపై విముఖత, ప్రియుడిపై ఏర్పడిన వ్యామోహంతో భర్తను హత్య చేయాలనుకున్నానని, అయితే వీలుకానందున ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపినట్లు కిరాతకురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. చెన్నై కుండ్రత్తూరు సమీపంలోగల మూండ్రాంకట్టలైకు చెందిన విజయ్‌ భార్య ప్రియుడిపై మోజుతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి ప్రియుడితో పరారైన విషయం తెలిసిందే. భర్త కార్యాలయంలో పని నిమిత్తం అక్కడే ఉండిపోవడంతో ఈ హత్య నుంచి తప్పించుకున్నాడు. ఇలాఉండగా దీనిపై పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇందులో పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి అభిరామి తన ప్రియుడు బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడు సుందరం ఇంటికి వెళ్లింది. అక్కడ సుందరం ఆమెను కన్యాకుమారికి వెళ్లమని, తాను అక్కడికి వచ్చి కలుసుకుంటానని తెలిపాడు. తామిద్దరం వివాహం చేసుకుని కాపురం చేద్దామని పేర్కొన్నాడు.

దీంతో అభిరామి కోయంబేడు బస్టాండ్‌ నుంచి బస్సు ఎక్కించిన సుందరం కున్రత్తూరుకు చేరుకున్నాడు. ఇలా ఉండగా పోలీసులు కున్రత్తూరులో తన ఇంట్లో ఉన్న సుందరాన్ని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన వివరాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం కన్యాకుమారికి చేరికుంది. అక్కడ కన్యాకుమారి బస్టాండ్‌లో అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తన భర్త సరిగా ఇంటికి రాడని, అంతేకాకుండా తనను అనుమానించేవాడని తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పేర్కొంది. ఇలా ఉండగా తనకు బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారిందని తెలిపారు. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకునే దాన్నని తెలిపింది. దీంతో భర్త అనుమానించడంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే పాలలో విషం కలిపి పిల్లలు, భర్తకు తాగించి హత్య చేయాలనుకున్నానని, అయితే భర్త తప్పించుకోగా, పిల్లలు మృతి చెందినట్టు తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top