నెల్లూరు మేయర్‌పై చీటింగ్‌ కేసు | cheating against nellore mayor | Sakshi
Sakshi News home page

నెల్లూరు మేయర్‌పై చీటింగ్‌ కేసు

Jan 11 2018 11:23 AM | Updated on Jan 11 2018 11:23 AM

cheating against nellore mayor - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మేయర్‌ తో పాటు అత‌ని సోద‌రుడు జ‌లీల్, డైరెక్ట‌ర్ అనిల్ పై మద్రాస్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో చీటింగ్ కేసు న‌మోదు అయింది. ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ..  స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ...గతేడాది డిసెంబర్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం మద్రాస్ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ) అండర్ సెక్షన్ 406,420, 506, రెడ్ విత్ 120-బి కేసులు నమోదు చేసింది.  మరోవైపు మేయర్‌ అజీజ్‌ సోదరులు ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. కాగా అబ్దుల్‌ అజీజ్‌పై చీటింగ్‌ కేసు వ్యవహారంలో అధికార టీడీపీలో కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement