కీచకుడి బెదిరింపు.. బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతి | B.Tech Student Who attempted suicide died | Sakshi
Sakshi News home page

Jun 2 2018 10:15 AM | Updated on Nov 6 2018 8:16 PM

B.Tech Student Who attempted suicide died - Sakshi

సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో గత నెల 28న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీటెక్ విద్యార్థిని రమ్యకృష్ణ చికిత్స పొందుతూ మరణించింది. 80 శాతం కాలిన గాయాలతో గత ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం ఉదయం ప్రాణాలు వదిలింది. గతంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో పెడతానని ఓ వ్యక్తి బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

మాక్లూరుకు చెందిన రమ్యకృష్ణకు ప్రసాద్‌ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ప్రసాద్‌ వృత్తి రీత్యా కువైట్‌లో స్థిరపడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదువు పూర్తి కావొస్తున్న రమ్యకృష్ణకు ఇంట్లో వివాహా సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్‌ పెళ్లికి ఒప్పుకుంటే గతంలో దిగిన ఫొటోలు నెట్‌లో పెడతానంటూ రమ్యను బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్యకృష్ణ గత నెల 28న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని, నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వద్ద స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement