ఇటుకలు మీద కూలి ఓ చిన్నారి.. విషాదం | Bricks Fallen On Child In Orissa | Sakshi
Sakshi News home page

ఇటుకలు మీద కూలి ఓ చిన్నారి.. విషాదం

May 25 2019 6:20 PM | Updated on May 25 2019 6:20 PM

Bricks Fallen On Child In Orissa - Sakshi

భామిని : బుడిబుడి అడుగులతో సందడి చేసే ముద్దులొలికే చిన్నారి ఒక్కసారిగా తమ కళ్లెదుటే మృత్యువు ఒడిలోకి చేరితే.. ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. ఊరకనే దొరికిన సిమెంట్‌ ఇటుకలే పాప ప్రాణాలు తీశాయని బోరున విలపించారు. గుండెలవిసేలా రోదించిన తీరు చూపరుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది శుక్రవారం మండలంలోని బాలేరు–సొలికిరి కూడలిలో జరిగింది. ఇంటి పెరట్లో వంటపాకకు అడ్డుగా పేర్చిన సిమెంట్‌ ఇటుకలు కూలి చిన్నారి వడ్డి నిహారిక(2) ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలింది. వంట చేస్తున్న తల్లి ఆదిలక్ష్మి, ఇంటి పనులు చేస్తున్న తండ్రి గోవింద్‌ చూస్తుండగానే ఈ ప్రమాదం వాటిల్లింది.

పరుగున వెళ్లి చిన్నారిపై కూలిన సిమెంట్‌ ఇటుకలను తొలగించే సరికే రక్తసిక్తమై విగతజీవిగా మారిన కూతురిని చూసి జీర్ణించుకోలేక పోయారు. సమీపంలో బాలేరు జిల్లా పరిషత్తు హైస్కూల్‌ ప్రహరీ కూలడంతో బయట పడిన సిమెంట్‌ ఇటుకలను తెచ్చి వంటపాకకు గోడగా కట్టారు. సుమారు నాలుగడుగుల ఎత్తు వరకు ఎటువంటి సిమెంట్‌ రాయకుండా ఇటుకపై ఇటుక పేర్చారు. బుడి బుడి అడుగులతో ఆడుకుంటున్న చిన్నారి ఈ గోడకు తగలడంతో ఒక్కసారిగా కూలిపోయి ప్రాణాలు తీసిందని విలపించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement