
మల్లికార్జునరావు (ఫైల్ ఫొటో) స్వరూప (ఫైల్ ఫొటో)
ధవళేశ్వరం/రాజమహేంద్రవరం క్రైం: రోడ్డు ప్రమాదంలో యువతీయువకుడు మృతి చెందిన సంఘటన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ధవళేశ్వరం కాటన్‌పేట వద్ద ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (18), నక్కిన వీరమల్లికార్జునరావు(20) మృతి చెందారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసుల కథనం ఇలా.. ఆనం స్వరూప రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
బుధవారం ఆమెకు బంధువైన నక్కిన వీరమల్లికార్జునరావుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేమగిరి వైపు వెళుతున్న భారీ కంటైనర్ లారీ ఢికొట్టింది. దీంతో స్వరూప, మల్లికార్జునరావు తలలపై నుంచి కంటైనర్ లారీ దూసుకుపోవడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. దక్షిణమండల ఇన్‌చార్జ్ డీఎస్పీ భరత్‌మాతాజీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ బాలశౌరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.