బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

కర్ణాటక, ముళబాగిలు : ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి కలిగి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నగరంలో చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్‌లో విస్తరణ అధికారిగా పనిచేస్తున్న మంజునాథ్ (35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకాలోని గుమ్లాపుర గ్రామానికి చెందిన మంజునాథ్ ముళబాగిలు ఎస్‌బీఐ బ్యాంకు విస్తరణాధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కొందరితో కలిసి ముత్యాల పేటలో ఓ సూపర్ బజార్ ప్రారంభించారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి