యువకుడిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం | Auto Driver Molestation On Young Man In Karnataka | Sakshi
Sakshi News home page

యువకుడిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం

May 31 2018 7:59 AM | Updated on Aug 1 2018 2:31 PM

Auto Driver Molestation On Young Man In Karnataka - Sakshi

బనశంకరి: ఓ ఆటోడ్రైవరు ఓ యువకుడిపై అ త్యాచారానికి పాల్పడిన ఘటన చెన్నమ్మకెరె అ చ్చుకట్టుపోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వె లుగుచూసింది.  ఉద్యోగనిమిత్తం 8 నెలల క్రి తం నగరానికి వచ్చిన బయటిరాష్ట్రానికి చెందిన మను అనే  యువకుడు నగరంలోని మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 23 తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఇట్టిమడుకు చెందిన రాజేశ్‌కు చెందిన ఆటోలో బసవనగుడికి వెళ్లడానికి నాయండహళ్లి వద్ద  మను ఆటో ఎక్కాడు. ఇట్టిమడు సమీపంలోని తన ఇంటి వద్దకు ఆటోను తీసుకెళ్లిన రాజేష్‌..దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పి వెళ్లాడు.

తర్వాత యువకుడిని రెండవ అంతస్తులోకి  రావాలని పిలిచాడు. ఏదైనా సహాయం కోసం పిలుస్తున్నారని భావిం చి వెళ్లిన మనుపై  రాజేష్‌ అత్యాచారానికి పాల్ప డ్డాడు. గదిలో జరిగిన దృశ్యాలన్నింటినీ విడీ యో తీశానని పోలీస్‌స్టేషన్‌ కు వెళ్తే వాటిని యూ ట్యూబ్‌లో పెడతానని అని   బెదిరించాడు. అనంతరం యువకుడిని బసవనగుడిలో వదిలిపెట్టి ఉడాయించాడు. జరిగిన విషయాన్ని మను తన సంస్థ అధికారులకు తెలియజేశాడు. వారు బాధితుడితో కలిసి  చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 377 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటోడ్రైవరుకోసం గాలింపుచర్యలు చేపట్టారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement