మోదీ హత్యకు కుట్ర: యువకుడు అరెస్టు | Attempt to murder on Narendra Modi Youngman Arrest | Sakshi
Sakshi News home page

మోదీ హత్యకు కుట్ర: యువకుడు అరెస్టు

Oct 1 2019 7:55 AM | Updated on Oct 1 2019 12:26 PM

Attempt to murder on Narendra Modi Youngman Arrest - Sakshi

టీ.నగర్‌: రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరిపి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. చెన్నై పోలీసు కంట్రోల్‌ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కాల్‌ చేశాడు. అందులో రాజీవ్‌గాంధీని హత్య చేసిన విధంగా మోదీని హతమార్చనున్నట్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిపి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో పోలీసులు వచ్చిన నంబరు ఆధారంగా విచారణ జరిపారు. చెన్నై తిరువాన్మియూర్‌ నుంచి ఆ వ్యక్తి కాల్‌ చేసినట్లు కనుగొన్నారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తిరునావుక్కరసును అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement