టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు

Atrocity Case file Against On TDP Activists In Bhamini - Sakshi

సాక్షి, భామిని(శ్రీకాకుళం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీలో టీడీపీ నాయకులు ఆటంకాలు సృష్టించి, గ్రామ వలంటీర్‌తో వివాదానికి దిగిన ఘటన ఆదివారం భామిని మండలంలోని తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయంలో అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం పాలకొండ డీఎస్పీ రామ్‌రాజు కొత్తూరు సీఐ ఎల్‌.సన్యాసినాయుడు, బత్తిలి ఎస్‌ఐ అజార్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో అట్రాసిటీ కేసుపై దర్యాప్తు చేపట్టారు. బియ్యం నాణ్యంగా లేవని వివాదం రేపిన టీడీపీ కార్యకర్తలు వలరౌతు అచ్చుతరావు, వలరౌతు శివలపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బియ్యం పంపిణీ విషయంలో గ్రామ వలంటీర్‌పై దుర్భాషలాడి వివాదానికి దిగారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుంకు అప్పలనర్సి ఫిర్యాదు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

వివాదం రేగిన సంఘటనపై డీఎస్పీ గ్రామ వలంటీర్‌ నుంచి వివరాలు సేకరించారు. వీఆర్‌ఓ హరిహరరావు, కార్యదర్శి ప్రమీలారాణి, మాజీ సర్పంచ్‌ బంటు శ్రీనివాస్‌ గ్రామస్తులున్నారు. అనంతరం బత్తిలి పోలీస్‌ స్టేషన్‌కు గ్రామానికి చెందిన ముగ్గురు వలంటీర్లను పిలిపించి పూర్తి వివరాలు నమోదు చేశారు.వలంటీర్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

టెక్కలి: పాతనౌపడ గ్రామ వలంటీర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఐ.కిషోర్‌కు స్పందన కార్యక్రమంలో సోమవారం ఆ గ్రామానికి చెందిన వ్యక్తలు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌పై దాడి చేయడంతోపాటు సమాచార హక్కు చట్టం పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడిన మర్ధల సురేష్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన లోకేశ్వర్రావు, యోగి, ఉమాశంకర్‌ తదితరులు ఆర్డీవోను కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top