చాలా రోజుల తర్వాత మద్యం సేవించడంతో.. | AR Head Constable Commits End Lives in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

May 5 2020 8:01 AM | Updated on May 5 2020 8:01 AM

AR Head Constable Commits End Lives in Hyderabad - Sakshi

అంబర్‌పేట: ఉరివేసుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌ కథనం ప్రకారం... అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్న బాలరాజ్‌(40) ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌. చాలా రోజుల తర్వాత మద్యం సేవించడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనుమానం వచ్చి కుటుంబసభ్యులు తలుపు తట్టగా తీయకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. బాల్‌రాజ్‌ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.

దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి తలుపులు పగలగొట్టి కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆయన మృతిచెందాడు. సమాచారం తెలుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(తెలంగాణలో మద్యానికి ఓకే! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement