పోలీసులను నిర్భందించిన మహిళలు

సాక్షి, చెన్నై : తనఖీల నిమిత్తం గ్రామంలోకి ప్రవేశించిన పోలీసులను మహిళలు నిర్భందించిన ఘటన తమిళనాడులోని విల్లూపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన పోలీసు బృందాలు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవటానికి తమిళనాడులోని విల్లూపురం వెళ్లారు. విల్లూపురంలోని కలవరియన్ కొండల్లో అర్థరాత్రి తనఖీలు చేపట్టారు.
కొద్ది సేపటి తర్వాత గ్రామంలోని మహిళలు పోలీసులను చుట్టుముట్టి నిర్భందించారు. ఏపీ పోలీసులను నిర్భందించారన్న సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు అక్కడి చేరుకున్నారు. మహిళలకు సర్ది చెప్పి వారిని విడిపించారు. ఎట్టకేలకు తమిళనాడు పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు సురక్షితంగా బయటకు రాగలిగారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి