అనస్థీషియా డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

AP Officials Suspends Anesthesia Doctor Sudhakar In Visakhapatnam - Sakshi

ప్రభుత్వం, అధికారులపై తప్పుడు ఆరోపణలు 

సాక్షి,విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేసినట్లు రుజువు కావడంతో ఉన్నతాధికారులు ఆయనను బుధవారం సస్పెండ్‌ చేశారు. ఇక డాక్టర్‌ ఆరోపణలపై క్షేత్రస్థాయిలో  వైద్యులతో కూడిన కమిటీని నియమించి ఉన్నతాధికారులు విచారణ జరిపించారు.

కాగా గతంలోను డాక్టర్‌ సుధాకర్‌ పనితీరుపై, వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు ఉన్నాయని అవి పోలీసు కేసు వరకు వెళ్లినట్లు డాక్టర్ల కమిటీ పేర్కొంది. అదే విధంగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి డాక్టర్‌ వెళ్లి మూడు గంటల పాటు ఉన్నట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయినట్లు కమిటీ వెల్లడించింది. ఇక ప్రభుత్వాన్ని, కరోనా నియంత్రణలో కష్టపడుతున్న వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగానే కుట్రలు చేసినట్లు కమిటీ నిర్ధారించింది. కమిటీ సిఫారస్సుల మేరకు ఆయనపై పోలీసు కేసు నమోదు చేసి సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top