ఆన్‌లైన్‌లో హీరోయిన్లు.. ఒక్కొక్కరికి ఒక్కో రేటు.!

Actress Complaint to Cyber Crime Police on Website - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీకు ఇష్టమైన నటీ మనులతో గడపాలనుకుంటున్నారా.. అయితే మా వెబ్‌సైట్‌ని సందర్శించండి. మీకు ఇష్టమైన నటీమణులు మీరు కోరుకున్న చోటుకే వస్తారంటూ.. ఒక్కొక్కరి ఫోటో కింద ఒక్కో రేటు నిర్ణయించి లొకాండో అనే వెబ్‌సైట్‌ ద్వారా ఓ సైబర్‌ నేరస్థుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. సినీ హీరోయిన్లు కాల్‌ గర్ల్స్‌గా వస్తారంటూ వెబ్‌సైట్‌ ప్రచారం చేస్తున్నాడు. 

అయితే తన ఫోటో లొకాండో వెబ్‌సైట్‌లో ఉందని తెలుసుకున్న ఓ నటి బుధవారం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోటోషూట్‌లో భాగంగా తీసుకున్న ఫోటోలను సేకరించి వెబ్‌సైట్‌లో ఉంచారని, ఆమెను కాల్‌ గర్ల్‌గా చిత్రీకరించి రూ.40 వేలు ధర నిర్ణయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్‌సైట్‌ వివరాలు సేకరించి నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు.

చొక్కారపు గణేష్ అనే వ్యక్తి మాజీ ప్రిన్సిపాల్ ఆన్‌లైన్ మాధ్యమంగా తెలుగు సినిమా మహిళా నటుల ఫొటోలు పెట్టి, వారితో గడిపేందుకు వెలకడుతున్నట్లు తెలిసింది. అయితే తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయం​ తెలుసుకున్న గణేష్, ఆ నటి ఫోటోలను డిలీట్ చేశాడని వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మూడు నెలల నుంచి గణేష్‌ ఇలా చేస్తున్నాడని, నటీమణుల ఫోటోలతో ఆన్‌లైన్‌ మాద్యమంగా విటుల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గణేష్ పెట్టిన పోస్టింగ్స్‌లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉన్నాయన్నాయని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top