
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ సినీ నటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. చింతమనేని అనుచరులు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వదంతులు సృష్టించడంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న చింతమనేని అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
అపూర్వ గతంలో ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటి ముందు టీడీపీ దిమ్మ కడుతుంటే అడ్డుకున్నందుకే కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తనను చింతమనేని తీవ్రంగా వేధించాడని.. ఆయన వల్లే గ్రామంలో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆరోపించారు.