ఆ దంపతులు.. నరమాంస భక్షకులు!

couple arrested in killing humans and eating case

మాస్కో : ఆ భార్యాభర్తలు నరమాంస భక్షకులు. మనుషులను ఎలాగైనా సరే హత్యచేసి వారి అవయవాలను హాయిగా భుజించడం గత కొన్నేళ్లుగా వీరి పని. కానీ మొబైల్‌లో తీసుకున్న సెల్ఫీలే వీరి నిర్వాకాన్ని బట్టబయలు చేశాయి. దీంతో భార్యాభర్తలు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దిమిత్రి భక్షీవ్ 35 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్య నటాలియాతో కలిసి రష్యాలోని క్రాస్నోడర్‌ నగరంలో నివసిస్తున్నాడు.

అయితే ఈ దంపతులు గత కొన్నేళ్లుగా వ్యక్తులను చంపి వారిలో తమకు నచ్చిన అవయవాలను తింటున్నారు. పండ్ల మాదిరిగానే మృతదేహాల అవయవాలను వాటి మధ్యలోపెట్టి తినేవారు. ఈ క్రమంలో తమ ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం వీరికి అలవాటు. ఈ క్రమంలో దిమిత్రి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. తనకు దొరికిన ఫోన్‌ను ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఫోన్‌లో డాటా చెక్ చేయగా మృతదేహాల అవయవాలు లేకపోవడం, ఇద్దరు భార్యాభర్తలు ఏదో తింటున్నట్లు కనిపించడంతో మాస్కో పోలీసులు వీరిని అనుమానించారు.

అదుపులోకి తీసుకుని విచారించగా తాము కేవలం ఇద్దరినే హత్యచేసినట్లు అంగీకరించారు. కానీ 1999 నుంచి భర్త, ఆపై ఇద్దరు కలిసి దాదాపు 30 మందిని హత్యచేసి వారి అవయవాలు తిన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఇంటి సెల్లార్లో మరిన్ని మృతదేహాలను పోలీసులు గుర్తించారు గత నెలలో క్రాస్నోడర్‌లో ఓ మహిళను దిమిత్రి భక్షీవ్, నటాలియాను హత్యచేసినట్లు రుజువైంది. హత్యకుగురైన వారిలో కేవలం ఏడుగురిని మాత్రమే పోలీసులు గుర్తించారు. తమ విచారణలో పూర్తి విషయాలు బయటకొస్తాయని వారు వివరించారు.  గతంలో ఫిలిప్పీన్స్‌లో, దుబాయ్‌లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. హత్యచేసి వారి మాంసాన్ని ఫ్రీజ్‌లో పెట్టుకుని తిన్న ఘటనలు గతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top