
‘సార్..! మా ఇంటాయన చనిపోయి సంవత్సరం అవతా ఉండాది. ముగ్గురు పిల్లలున్నారు. పింఛన్ అడిగితే ఎవరూ ఇవ్వలేదు. కూలి చేస్తేనే ఇల్లు గడస్తా ఉండాది. ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకోవాలి..’ అంటూ పాదిరేడుకు చెందిన హేమలత ప్రజా సంకల్పయాత్రలో జననేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన పి జయమ్మ, సుభద్ర మాట్లాడుతూ తాము నిరుపేదలమని, ఉండడానికి ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సొంతిటి కోసం ఆరేళ్లుగా దరఖాస్తులు పెట్టుకున్నా ఉపయోగం లేదన్నారు. పేదల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరారు.