1400 సీసీ కెమెరాలతో తిరుమలకు భద్రత

1400 cctvs in tirumala - Sakshi

స‍్మోక్‌ డిటెక్టర్, ఫేస్‌ రికగ్నిషన్, క్రౌడ్‌ కంట్రోల్‌ కెమెరాల ఏర్పాటు

సోమవారం నుండి పనులు ప్రారంభం

సాక్షి, తిరుమల:  ధార్మిక క్షేత్రమైన తిరుమలలో మొత్తం 1400 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత కల్పిస్తామని టీటీడీ సీవీఎస్‌వో ఆకే.రవికృష్ణ అన్నారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఇందుకోసం నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎన్‌ఐసి) సహకారం తీసుకుంటున్నామన్నారు.

మొదటి దశలో హైసెక్యూరిటీ జోన్‌లోని శ్రీవారి ఆలయం, పరకామణి, మాడ వీధుల్లో 175 ఫిక్స్‌డ్‌ కెమెరాలు, 87 పీటీజె కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామన్నారు. అగ్ని ప్రమాదాలు గుర్తించేందుకు స్మోక్‌ డిటెక్టర్, అసాంఘిక శక్తులను గుర్తించేందుకు ఫేస్‌ రికగ్నిషన్, భక్తుల రద్దీని తెలుసుకునేందుకు క్రౌడ్‌ కంట్రోల్‌ కెమెరాలు  వినియోగిస్తామన్నారు. కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. తిరుమలలో ఏర్పాటుచేయబోయే సీసీ కెమెరాల పనితీరును సీవీఎస్‌వో లాబ్‌టాప్‌లో స్వయంగా చూపించారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top