అక్కడ ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్! | YouTube launches new features in Pakistan | Sakshi
Sakshi News home page

అక్కడ ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్!

Sep 30 2016 3:53 PM | Updated on Sep 4 2017 3:39 PM

అక్కడ ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్!

అక్కడ ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్!

పాకిస్థాన్ లో ఎనిమిది నెలల తర్వాత యూట్యూబ్ తిరిగి ప్రారంభమైంది.

కరాచీ: పాకిస్థాన్ లో ఎనిమిది నెలల తర్వాత యూట్యూబ్ తిరిగి ప్రారంభమైంది. పాక్ యూజర్లు చేరువయ్యేందుకు కొత్తగా మరిన్ని ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఆఫ్ లైన్ ల్లోనూ వీడియోలు వీక్షించే అవకాశం కల్పించింది. రీ లాంచింగ్ సందర్భంగా కరాచీలోని డీహెచ్ఏ గోల్ఫ్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆఫ్ లైన్ ఫీచర్లను ప్రకటించింది.

‘పాపులర్ వీడియోలు తాత్కాలికంగా ఆఫ్ లైన్ ల్లోనూ వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. యూజర్లు తమకు ఇష్టమైన వీడియోలను సులువుగా వీక్షించేందుకు ఈ ఫీచర్ ప్రవేశపెట్టాం. దీని ద్వారా వీడియోలకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయ’ని గూగుల్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ బిలియన్ యూజర్స్ టీమ్ హెడ్ తానియా అయిడ్రస్ తెలిపారు.

పాకిస్థాన్ వినియోగదారులకు వీడియో కంటెంట్ ను మరింత అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ ఫీచర్ ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వీడియోలు చూడొచ్చని వెల్లడించారు. తాము ఎంచుకున్న వీడియో 48 గంటల పాటు ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. వై-ఫై, డేటా కనెక్షన్ లేకుండానే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చన్నారు. కంటెంట్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ ను ప్రకటించారు. దీని ద్వారా వీడియోలు రూపొందించేవారికి అవకాశాలు, నైపుణ్యాలు పెంచుకోవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement