రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది: ఫెడ్ | Yellen Says Interest Rate Hike Could Come 'Relatively Soon' | Sakshi
Sakshi News home page

రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది: ఫెడ్

Nov 18 2016 12:19 AM | Updated on Aug 24 2018 4:48 PM

రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది: ఫెడ్ - Sakshi

రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది: ఫెడ్

అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని చైర్‌పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే.

వాషింగ్టన్: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని చైర్‌పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు వడ్డీరేట్ల పెరుగుదలకు దోహద పడేవిగా వివరించారు. కాంగ్రెస్ జారుుంట్ ఎకనమిక్ కమిటీకి ఆర్థిక వ్యవస్థ గురించి ఆమె వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రమంగా రేటు పెంపు సంకేతాలను ఇచ్చారు. రేట్ల పెంపునకు మరీ సమయం తీసుకుంటే అది ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కూడా ఆమె అన్నారు.  డిసెంబర్ 13,14 తేదీల్లో వాషింగ్టన్‌లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలకు తాజా యెలెన్ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement