షావొమీ రెడ్‌మి సిరీస్‌లో... మూడు కొత్త మోడళ్లు | Xiaomi Redmi 6 series launch in India today | Sakshi
Sakshi News home page

షావొమీ రెడ్‌మి సిరీస్‌లో... మూడు కొత్త మోడళ్లు

Sep 6 2018 1:37 AM | Updated on Nov 6 2018 5:26 PM

Xiaomi Redmi 6 series launch in India today - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావొమీ.. రెడ్‌మి సిరీస్‌లో కొత్తగా మూడు మోడళ్లను బుధవారం ఆవిష్కరించింది. రెడ్‌మి 6, రెడ్‌మి 6ఏ, రెడ్‌మి ప్రో పేర్లతో వీటిని రూపొందించింది. చిత్రాల స్పష్టత కోసం ముందు కెమెరాలకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పోట్రేట్‌ మోడ్‌ను జోడించారు. మూడు మోడళ్లకూ 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 2 గిగాహెట్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫేస్‌ అన్‌లాక్, డ్యూయల్‌ సిమ్‌ ఏర్పాటు ఉంది. హైదరాబాద్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో షావొమీ సీవోవో బి.మురళీకృష్ణన్‌ పాల్గొన్నారు. భారత్‌లో నంబర్‌–1 స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా నిలిచామన్నారు. జూన్‌ త్రైమాసికంలో ఆన్‌లైన్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 55.6% వాటాతో అగ్రస్థానం దక్కించుకున్నట్టు చెప్పారు. రూపాయి మరింత క్షీణిస్తే... స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచక తప్పదని స్పష్టం చేశారు. 

రెడ్‌మి 6: 5.45 అంగుళాల ఫుల్‌ స్క్రీన్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 12+5 ఎంపీ డ్యూయల్‌ కెమెరా, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లున్నాయి.
ధర 7,999–9,499. 
రెడ్‌మి 6ఏ: 5.45 అంగుళాల ఫుల్‌ స్క్రీన్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 13 ఎంపీ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.5,999–6,999. 
రెడ్‌మి 6 ప్రో: 5.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 12+5 ఎంపీ డ్యూయల్‌ కెమెరా, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ మెమరీ, 4,000 ఎం ఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. ధర రూ.10,999–12,999. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement