మరో సంచలనం దిశగా షావోమి

Xiaomi patents for foldable smartphone with rotating quad camera - Sakshi

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లోకి షావోమి

డిజైన్‌ పేటెంటు పొందిన షావోమి

సాక్షి,న్యూఢిల్లీ : ‍ స్మార్ట్‌ఫోన్‌​ విభాగంలో  రికార్డు అమ్మకాలతో  దూసుకుపోతున్న చైనా   మొబైల్‌ తయారీ దారు  షావోమి మరోమెట్టు   పైకి  ఎదగాలని భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌   రంగంలో తదుపరి  సెగ్మెంట్‌ ఫోల్డింగ్  ఫోన్‌ల తయారీలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనకు సంబంధించి డిజైన్‌  పేటెంట్‌ను  సొంతం చేసుకుంది.  ముఖ్యంగా   ఈ   ఫోన్‌లో రొటేటింగ్‌ క్వాడ్-కెమెరా  ప్రధాన ఫీచర్‌గా వుండటం ఆసక్తికరంగా మారింది. (రెడ్‌మి ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు త్వరలో)

గిజ్మో చైనా నివేదిక ప్రకారం షావోమి ఫో‍ల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌  కెమెరా  సెల్ఫీల కోసం ముందుకి,  సాధారణ ఫోటోల కోసం వెనక్కి రొటేట్‌ అవుతుందట.  దీనికి  సంబంధించిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 48 చిత్రాలను కూడా  రీలీజ్‌చేసినట్టు తెలిపింది.  అయితే సాధారణ  స్మార్ట్‌ఫోన్లలో రొటేటింగ్‌ కెమెరా ఇప్పటికే ఉన్నప్పటికీ మడతఫోన్లలో  ఇదే మొదటిది.

ఇప్పటికే మోటరోలా రాజర్ మడతపోన్‌తో పాటు, శాంసగ్‌​ గెలాక్సీ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌ విజయవంతమైన నేపథ్యంలో   వినియోగదారులను ఆకర్షించేందుకు తరువాతి సెగ్మెంట్‌లోకి షావోమి జంప్‌ చేయనుంది. అయితే  ఈ అంచనాలపై షావోమి అధికారికంగా స్పందించాల్సి  వుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top