షావోమీ ఎంఐ మిక్స్‌ 2ఎస్‌ లాంచ్‌ | Xiaomi Mi Mix 2s launched | Sakshi
Sakshi News home page

షావోమీ ఎంఐ మిక్స్‌ 2ఎస్‌ లాంచ్‌

Mar 27 2018 1:54 PM | Updated on Mar 27 2018 1:59 PM

Xiaomi Mi Mix 2s launched - Sakshi

బీజింగ్‌: చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి  కొత్త హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది.    ఎంఐ మిక్స్‌ 2ఎస్ పేరుతో  స్మార్ట్‌ఫోన్‌ను  చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.   బెజెల్‌ లెస్‌​ స్క్రీన్‌తో తన జాగా  ఫ్లాగ్‌షిప్‌ డివైస్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది.   8జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌, 6 జీబీ/128 స్టోరేజ్‌,  6 జీబీ/64 స్టోరేజ్‌ వెర్షన్‌లను అందుబాటులో ఉంచింది.  చైనాలో  8జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌ ధర సుమారు రూ.41,438గా ఉండగా 6 జీబీ/128 స్టోరేజ్‌ వేరియంట్‌  ధర సుమారు  రూ. 37,000, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ.34,185గా ఉంది. అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ, వైర్‌లెస్‌ చార్జర్‌, ఫింగర్‌ ప్రింట్‌  రీడర్‌ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. దీంతోపాటు ఎంఐ  గేమింగ్‌ ల్యాప్‌టాప్‌, ఎంఐ స్పీకర్‌ మినీని లాంచ్‌ చేసింది.

ఎంఐ మిక్స్‌ 2 ఎస్‌ ఫీచర్లు
5.9 బెజెల్‌ లెస్‌ స్క్రీన్‌
స్నాప్‌ డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
2160×1080 ఫుల్‌ హెచ్‌డీ  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
 12+12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ







Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement