శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్‌ అవార్డు | World's Best Airports in 2019 are announced | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్‌ అవార్డు

Mar 29 2019 5:17 AM | Updated on Mar 29 2019 5:17 AM

World's Best Airports in 2019 are announced - Sakshi

అవార్డును అందుకుంటున్న జీహెచ్‌ఐఎల్‌ ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు మరోసారి అరుదైన ఘనత సాధించింది. తాజాగా స్కైట్రాక్స్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై పురస్కారాలు ప్రకటించింది. అందులో జీఎంఆర్‌ నేతృత్వంలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమఎయిర్‌పోర్టుగా పురస్కారం గెలుచుకుంది. మరోవైపు విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగాను అవార్డు దక్కించుకుంది. ఒకేసారి రెండు విభాగాల్లో గుర్తింపు సాధించి తన ప్రత్యేకత చాటుకుంది. లండన్‌లో నిర్వహించిన ప్యాసింజర్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (జీహెచ్‌ఐఎల్‌) ఈ పురస్కారాలను అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement